Categories
ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఎర్ర కందిపప్పు తో ప్యాక్ వేసుకుంటున్నారు ఎక్సపర్ట్స్. ఎర్ర కందిపప్పు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి అందులో కాసిని పచ్చి పాలు పోసి కలపాలి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి వేసుకునే ముందర నెమ్మదిగా ముఖానికి ఈ మిశ్రమం తో మర్దన చేయాలి అరగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇది ట్యాన్ తొలగించి చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి ముఖం మెరిపిస్తుంది అలాగే ఎర్ర కందిపప్పు గుజ్జులో పచ్చి పాలు బాదం నూనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అలాగే పసుపు, కొబ్బరి నూనె కలిపి కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గుతాయి.