Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/09/800X535manikarnika_the_queen_of_jhansi_poster_release_kangana_plunge_into_kashi_for_success.gif)
నా కుటుంబం మొత్తం నాస్తికులే . ఏ మతాన్ని అనుసరించరు కానీ, నా చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువ. నేను శివభక్తురాలుని. నా ప్రతి సినిమా ప్రారంభానికి ముందు వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొంటాను. నా మణికర్ణిక సినిమా పోస్టర్ ను కూడా అక్కడే ఆవిష్కరించాను అంటోంది కంగనా రనౌత్. కాశీ నాకు ఇష్టమైన ప్రాంతం గంగానది, పరవళ్ళు, హారతి భక్తిన ప్రతి బింభించే అక్కడి పాటలు ,వాతావరణం నాకు చాలా ఇష్టం ,ఆ వాతవరణంలో ఏదో అనీర్వచనీయమైన అనుభూతి నాకు దొరుకుతోంది. నాకేం కావాలో ఆ పరమశివుడికి తెలుసు అంటోంది కంగనా రనౌత్. గత సంవత్పరం జమ్ముకాశ్మీర్ లో ఉండే వైష్టోదేవి ఆలయాన్ని కూడా చూసిందట కంగనా రనౌత్. స్వామీ వివేకనంద భోధనలు ,భగదగ్దీత సారాన్ని విశ్వశిస్తా అంటోంది కంగనా.