వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప పువ్వు సేకరించి ఎండబెట్టి పొడి చేసి ఏడాది పొడువునా వాడుకుంటారు. ఈ పువ్వును పారిశ్రామికంగా అనెక ఔషధాలు గాయాల నివారణకు వాడే ఆయిట్ మెంట్స్ లో సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వ్యాదుల నివారణ్ కోసం వాడుకో వచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీలకర్ర, వేప పూల పొడి కలిపిన పానీయం తాగితే ఆకలి పెరుగుతుందింట. ఈ పొడి ఆహార పదార్ధాల్లో చల్లుకుని తింటే కంటి చూపు మెరుగు అవ్వుతుంది. ఆకులూ పువ్వులు కలిపి మెత్తగా రుబ్బి, మొహం పైన రస్తే మొటిమలు పోతాయి. ఈ పువ్వుల్లో వుండే సువాసనను పరిమళ చికిత్సలో కూడా ఇతర పువ్వులతో కలిపి వాడతారు. ఎదో ఒక రూపంలో ఈ పువ్వుల్ని తీసుకుంటే జీవక్రియ బాగుంటుంది. రక్త నాళాలు చెక్కగా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తలో చెక్కర శాతం నియంత్రణ లో వుంటుంది. బరువు టో పాటు పొట్ట తగ్గాలనుకొంటె మంచి ఔషదం ఇంకొకటి లేదు.
Categories