Categories
పట్టుచీరె ఎప్పుడు సెలబ్రేషన్ . అందులో పట్టులోనే ఎన్నో వెరైటీలు , సింపుల్ డిజైన్లతో బరువు లేకుండా సహాజమైన వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ఏ ఫంక్షన్ లకైనా అనువుగా అమరేవి ఇటు బెనారస్ కోరా సిల్క్ లు, అటు కంచి ఆరణి పట్టు చీరెలు. ముచ్చటైన మంచి రంగుల కలపోతలతో ,చీరె నిండుగా డిజైన్ తో ఆరణి పట్టు ధగధగలాడే పూల డిజైన్ లతో పసిడి తీగల అల్లీకలు ,బెనరస్ కోరా సిల్క్ అందమే అందం. వీటినీ ప్రత్యేకంగా చూపించేవి చక్కని పసిడి అందాలు , వైవిధ్యమైన రంగులు , కోరా పట్టు ,ఆరణి ,బెనారస్ లు ఏ చీరె అయినా కట్టగానే ఒక పండగ కళ వచ్చేయటం ఒక విస్మయం.