హాయిగా నిద్ర పట్టాలంటే వేడి పాలలో కొద్దిగా జాజికాయ పొడి లేదా యాలుకల పొడి వేసి మరిగించి తాగితే బాగా నిద్ర వస్తుంది.లేదా వేడి పాలలో పసుపు లేదా మిరియాల పొడి కలిపి తాగినా చక్కని నిద్ర వస్తుంది.వేడి నీళ్లలో తులసి, మిరియాల పొడి, పసుపు వేసి మరిగించి కషాయం తాగిన సరే. నిద్రపోయేముంద కాఫీ, టీ లు తాగకూడదు.తలకు అరికాళ్లకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. నిద్రపోయే గదిలో వెలుతురు తక్కువగా ఉండాలి.గాలి, బాగా తాకేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే హాయిగా నిద్ర పోవచ్చు.

Leave a comment