సహజమైన లేత ఎరుపు రంగులో పెదవులు కనిపించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అంటారు ఎక్స్పర్ట్స్.వారానికి ఒకసారి నాచురల్ లిప్ స్క్రబ్బర్ ను ఉపయోగించాలి దీనివల్ల మృత కణాలు పోతాయి.కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లో అర టీ స్పూన్ షుగర్ కలిపితే నేచురల్ లిప్ స్క్రబ్బర్ తయారవుతుంది.రాత్రివేళ పడుకునే ముందర పెదవులపై నిమ్మ రసం రాస్తే నలుపుగా ఉన్న పెదవులు సాధారణ రంగు లోకి వచ్చేస్తాయి నిమ్మచెక్క పైన పంచదార వేసి పెదవులపై రుద్దిన మృతకణాలు పోతాయి. బీట్ రూట్ లో నేచురల్ బ్లీచింగ్ గుణాలుంటాయి .డార్క్ లిప్స్ ని లేత రంగు లోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయి. బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ కలిపి రాత్రివేళ పెదాలపై రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి రోజు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a comment