నీహారికా,

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే ,ఒదటి అనర్ధం ఒక్కటి వుంటుంది. ఎంత సేపు చదువుకోండి అని వెతపడటం కంటే తప్పు ఇంకేం వుంటుంది చెప్పు. వాళ్ళకు స్కూళ్ళు తర్వత ఆటవిడుపు కావాలనే, కుటుంబ యాక్టివిటీలకు వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదల ఎంతో బావుంటుందని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా వుంటే మరి మానసిక ఆరోగ్యం అంత చురుకుగా వుంటుంది. ఇటీవల కాలంలో   పిల్లలకు ఆటలకు ఇతరాత్ర కార్యక్రమాలకు తీరికేది పాపం. కొంతసేపయినా వారికి శరీరక వ్యాయామం ఉంటుందా? ఇరుగు  పొరుగు పిల్లలతో ఇంటరాక్షన్ వుందా? ఏ అనుభూతులు లేకపోతే పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తునే వున్నారు. పిల్లల్ని ఆడుకోనివ్వాలి. శరీరానికి వ్యాయామం ఇవ్వాలి. సూర్య రస్మి తగాలనివ్వాలి. ఇంట్లో వాళ్ళతో కలిసి సంతోషం పంచుకోనివ్వాలి. అప్పుడే పిల్లలు శారీరకంగా మానసికంగా చక్కగా ఎదుగుతారు.

Leave a comment