ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో చేర్చేస్తారు. కాబట్టి ఇద్దరు సమానం అనే ఉద్దేశాన్ని వాళ్ళల్లో కలుగనివ్వాలి. ఆట వస్తువులు ఎవ్వరికి ఇష్టం అయినవి వాళ్ళకు కొనివ్వాలి. రెండో వాళ్ళ దగ్గరనుంచి బలవంతంగా ఇంకొకళ్ళ కోసం ఏ వశువు బలవంతంగా లాక్కోవద్దు. పిల్లలు ఇద్దరు పసివాల్లే. బలహీనమైన వాళ్ళే. కారణం తలుసుకుని అప్పుడు ఎవరి తప్పు అయితే న్యాయం గా వాళ్ళనే కారణం చూపించి మరీ కోప్పడాలి. సరైన జుడ్జిమెంట్ ఇవ్వాలి. ఒకళ్ళ ఫిర్యాదు తో ఇంకొక్కల్లను దండిస్తే పిల్లలు బాధపడతారు.తప్పు ఎవరిదో నిర్ధారించి చెప్పి మరీ కోప్పడాలి.

Leave a comment