Categories
చక్కని చీరె కట్టుకొని చేతిలో బరువేదీ ఉంచుకొకుండా హాయిగా బయటికి వెళ్ళటం బాగానే ఉంటుంది. కానీ సెల్ ఫోన్, కార్డులు, తాళాలు, కొంచెం డబ్బు ఇవన్నీ అవసరం కదా. అందుకే ఇలాంటీ అత్యావసరమైన వస్తువులు ఉంచుకొనేందుకు వీలుగా పాకెట్ శారీస్ వచ్చేశాయి. చీరె అంచున పాలిన్ వస్త్రంతో చీరెకు ఓ జేబుకుట్టేస్తున్నారు. లేదా డిజైన్ తో కలిసిపోయే రంగుతో పక్షి, నెమలి ,పువ్వులాంటివి సృష్టించి సన్నని జిప్ తో అక్కడ జేబు ఉందనే విషయం కూడా కనిపించకుండా కనికట్టు చేస్తున్నారు. ఇప్పుడిక ఈ డిజైన్ చీరె కట్టుకుంటే ఇక వేరే హాండ్ బ్యాగ్ లు అక్కర్లేదు.