జై శ్రీ రామ్

గుంటూరు జిల్లా నుంచి నిడుబ్రోలు మీదుగా పోన్నూరు చేరుకుని 24 అడుగులు ఎతైన హనుమంతుల వారి విగ్రహాన్ని కనులారా చూచి లోకా సమస్ధా సుఖినో భవంతు అని నమస్కరించుకుందాం పదండి.
ఇక్కడ స్వామి వారికి నిన్న, ఈ రోజు, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.లక్ష తమలపాకులతో అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి మనమందరం పూజించుకుందామా!! ఆలయం మొదట్లో ఒక రావి చెట్టు ఉన్నది దాని చుట్టూత ప్రదక్షిణలు చేస్తారు.ఇక్కడ సహస్ర లింగేశ్వరుడు, కాలభైరవుడు మొదలగు విషయాలను కూడా దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.ఈ ఆలయాన్ని బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాధ స్వామి వారు నిర్మించారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి, చిట్టి గారెలు

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment