మెనోపాజ్ దశలో ప్రత్యేకమైన పోషకాహారాన్ని తీసుకోకపోతే ఎముకలు బలహీనపడి పోతాయి అంటున్నారు డాక్టర్లు. మూడ్ స్వింగ్స్, నిద్ర రాక పోవడం హృదయ స్పందన లో తేడా అధిక బరువు వంటివి సమస్యలు వస్తాయి దాన్ని అధిగమించాలి అంటే కాల్షియం, మెగ్నీషియం,డి-విటమిన్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు వర్ణ భరితమైన కూరగాయలు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పెరుగు, వెన్న, పాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. భోజనం ప్లేటు ఉడికించిన కూరగాయలు మిగతా సగం పండ్లతో నిండాలి. ప్రోటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. అరగంట వ్యాయామం చేయాలి.

Leave a comment