ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్ వున్నవాళ్లు కూడా హాయిగా తినచ్చు. వీటిలో గ్లేసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. A ,C విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,కెరోటిన్లు ,జామపండులో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఒక పండు తినచ్చు. జామ పండులో వుండే సోడియం ,పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో వుండే విటమిన్ A కారణంగా కంటి చూపు బావుంటుంది. ఫోలిక్ యాసిడ్ ,విటమిన్ B9 అధికంగా ఉండటం వల్ల గర్భిణులు తింటే గర్భ శిశువు ఎదుగుదల బావుంటుంది. జామలో వుండే మెగ్నేషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు నొప్పులు బాధించవు.
Categories