Categories
శారీరక శ్రమ తక్కువగా ఉండటం ఆఫీసుల్లో ప్రయాణాల్లో గంటలకొద్ది కూర్చొని ఉండటం ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవటం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పెరుగుతుంది. పొట్ట తగ్గాలంటే ముందుగా ఎనిమిది గంటలు హాయిగా నిద్ర పోవాలి. అరగంటయినా శారీరక శ్రమ చేయాలి వారానికి మూడు సార్లు ఏరోబిక్ ఎక్సర్ సైజులు మిగతా మూడు రోజులు బరువులు ఎత్తే శక్తి నిచ్చే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. చక్కెర బెల్లం స్వీట్స్ కేక్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్ బియ్యం అటుకులు తగ్గించాలి. తాజా కాయ కూరలు ఆకుకూరలు పండ్లు పప్పు దినుసులు గుడ్లు సోయా, ఆకుకూరల వినియోగం పెంచాలి.