Categories
ఈ మధ్య కాలంలో వీట్ బ్రాన్ కు చాలా డిమాండ్ ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. గోధుమల పై ఉందే పోట్టు ఇది. గోధుమ పిండి ఆడించి ఈ పొట్టు వేరు చేస్తారు. ఇది పూరి ధాన్యపు ఉత్పత్తి. ఇందులో కరిగే , కరగని రెండు రకాల పీచు పదార్ధాలు దొరుకుతాయి. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెంచగలదు. ఎన్నో క్యాన్సర్ రిస్కులను తగ్గిస్తుంది. ఈ వీట్ బ్రాన్ లోని నియాసిన్ గుండె సంబంధిత రిస్క్ తగ్గిస్తుంది. ప్రోటీన్లు, ఎమినో యాసిడ్స్ లభిస్తాయి.మెగ్నీషియం ,ఐరన్, విటమిన్స్, మాంగనీస్ వంటి పోషకాలి పుష్కలంగా లభించేవీట్ బ్రాన్ ఎన్నో రకాలుగా తినవచ్చు.