నీహారికా,

చాలా మంది ఉదయాన్నే లేచి నడుస్తామని, ప్రకృతిని చ్గుస్తూ  నడవడం ఆరోగ్యమని చెప్పుతారు. కానీ సరిగ్గా గమనిస్తే ఆ ఉదయపు నడకలు కుడా ఎవరో తరుముతున్నట్లే కనిపిస్తాయి. చెవిలో ఇయర్ ఫోన్ లు, చేతిలో స్మార్ట్ ఫోన్లతో అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ, చుటు పక్కల ఎవరున్నారు చూసే పాటి తీరిక లేకుండా కనిపిస్తారు చాలా మంది. అసలు మన నగర జీవితం లోనే ఏ పర్కులోనో ఓ పక్షి గొంతు వినిపిస్తుంది. ఏ పిచ్చుకలో, వుడుటలో కనిపిస్తాయి. ఓ పువ్వు, చక్కని చెట్లు, పచ్చని ఆకులూ కనిపిస్తాయి. ఇవన్నీ పట్టించుకోకుండా గబగబా నడుచుకుంటూ పొతే ఏవిటీ ప్రయోజనం. అసలు ఫోన్ లేక పోతేనే గా పరిసరాలు గమనించగాలిగేది. ఉదయించే సూర్యుడిని చుస్తూ  వికసిస్తున్న పువ్వును చూస్తూ, ఎదురొస్తే స్నేహితులను పలకరిస్తూ, వీచే గాలిని ఆస్వాదిస్తే కదా దాన్ని ఉదయపు నడక అనాలి. ఇవేం లేకుండాఎప్పటి హడావుడి పరుగు తో దాన్ని ఆరోగ్యం కోసం ఎంత వరకు న్యాయం?

Leave a comment