అలంకరణలో ముఖ్యమైన భాగం పువ్వులే. చాలా మంది ప్రతిరోజు ఏవో ఒక పువ్వులు లేదా ఆయా సీజన్ లో పూచే పువ్వులు పెట్టుకోవడం ఇష్టం. కాని మల్లెపువ్వులను మించిన పువ్వులు ప్రపంచంలో ఇంకేంలేవంటారు ఎక్స్ పర్ట్స్. మానసిక ఆందోళనకు గురవుతున్న వారికి వేలియమ్ అనే మందు ఇస్తారట. ఆ మందు మనసుని ప్రశాంతపరిచి మెదడు పైన ఎలాంటి ప్రభావం చూపెడుతుందో మల్లెపువ్వులు కూడా అదే ప్రభావం చూపెదతాయట. మల్లెలు మెదడులోని బావోద్వేగాలను అదుపుచేసే కేంద్రం పైన ప్రభావం చూపెడతాయంటున్నారు. మల్లెల వాసన ఇల్లంతా వ్యాపిస్తే చాలు ఇంట్లో ఉన్న అందరి మనసులు ప్రశాంతంగా ఉంటాయని అద్యాయనాలు చెబుతున్నాయి.

Leave a comment