నటన విషయంలో నా పై విమర్శలోస్తే నేను చాలా సిరీయస్ గా తీసుకుంటా. ఇలాంటి పాత్రల్లో సమంత నటించగలదా? ఆమె న్యాయం చేయగలదా అంటూ కొన్ని అభిప్రాయాల్ని వింటూ ఉంటా కదా …వెంటనే నాకు పట్టుదల వస్తోంది.వాటిని ఓ సవాల్ గా తీసుకొని చాలా కష్టపడతా అంటోంది సమంత. ఇప్పడు నడుస్తున్న ఈ దశ నటిగా నాకు చాలా సంతృప్తి ఇస్తోంది. చక్కని కథలు వస్తున్నాయి. నా అభిరుచికి తగ్గవి ఎంచుకొంటున్న ఇక అందులో నా పాత్ర గురించి వినగానే నా అన్వేషణ మొదలవుతుంది. నాకు నేనై ఎన్నో విషయాలు రీసెర్చ్ చేసినంత పని చేసి నేర్చుకొంటా. బహుశ ఇది నా అనుభవం నాకు నేర్పిందే నేను హోమ్ వర్క్ చేశాక ఇక చివరగా దర్శకుడు చెప్పినట్లు వింటా అప్పుడు ఆ పాత్రకి పర్ ఫెక్ట్ న్యాయం చేసినట్లు ఫీలవుతా.అంటోంది సమంత. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు చూస్తుంటే ఇదంత మన స్ఫూర్తిగా చెపుతున్నట్లు రజువవుతోంది.
Categories