లెట్ హర్ ప్లయ్ ఏ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ అన్న పుస్తకాన్ని మలాలా తండ్రి జియాఉద్దిన్ రాశారు.లండన్ లో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూ హెఛ్ అలెన్ అండ్ కంపెనీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో ఆయన తన కూతురు మలాలా గురించి చెబుతూ 2013లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాభితాలో మలాలా 15వ స్థానంలో ఉందని ఆమె ఫోటో కవర్ పేజ్ పైన వేశారు.ఆ సమయంలో మలాలా బులెట్ గాయంతో ఆస్పత్రిలో ఉంది.తండ్రి ఆమెకి ఆ ఫోటో చూపిస్తే ఆ చిన్న వయసులోనే మలాలా మనుషుల్ని ప్రత్యేకంగా చూపించే విభజన నాకు నచ్చలేదు అందట. ఆ చిన్న పిల్లకున్న విచక్షణ ఎంత మందిలో ఉంటుంది.