సినిమా చాలా ఇష్టం .ఇంట్లో వాళ్ళు సినిమా పట్ల ఇష్టం చూపి ప్రోత్సహించారు. ప్రేమమ్ తర్వాత ఇక అంత ఒకే .ఎంతో మంది అభిమానులు ,మంచి పాత్రలు అంటుంది అనుపమా పరమేశ్వరన్. సినిమాల విషయంలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా అన్న ఒక్క విషయం చూసుకొంటా. పాత్ర ప్రాధాన్యత ఉంటే అది హీరోయిన్ పాత్రే ఉండనక్కర్లేదు నెగిటెవ్ షేడ్ అయినా ఇష్టమే .అ ఆ లో నా పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. పైగా మెయిన్ హీరోయిన్ కూడా కాదు. ఎలా ఉన్న నన్ను ప్రేక్షకులకు దగ్గర చేయాలి అంతే అంటుంది అనుపమా పరమేశ్వరన్. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు పోషించే శక్తి ఇంకా రాలేదనుకొంటాను. బోలెడంత అనుభవం సంపాదించాక నిర్మాతలకు నాపై నమ్మకం కుదిరాకా అప్పుడు చేయాలి మరీ అంటుంది అనుపమా.

Leave a comment