వర్షాలు మొదలయ్యాయి . వాతావరణంలోని మార్పులు ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులకు కారణమై జలుబు,దగ్గు ఇతర సీజనల్ వైరస్ లకు దారి ఇస్తుంటారు.ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ సరేసరి.జలుబు, ఫ్లూ వంటి వాటిని అడ్డుకునేందుకు సమతులాహారం, తీసుకునే ఇతర ముందస్తు జాగ్రత్త చర్యలు కలిసి అనారోగ్యం బారి నుంచి కాపాడటం లో సహకరిస్తాయి. ఈ సీజనల్ లో వచ్చే రుగ్మతులు దృష్టిలో ఉంచుకుని అందరూ అనుగుణమైన ఆహారం తీసుకోవాలి.ప్రోబయోటిక్స్ ఉండే ఆహారం, అంటే పులియబెట్టిన పదార్థాలు పెరుగు, మజ్జిగ వంటివి అదనపు పోషకాలు అందిస్తాయి. అల్లం, లవంగం,వెల్లుల్లి, పసుపు, దాల్చిన, చెక్క, ఒరెగానో, వంటి వాటిలో అత్యధిక మోతాదులు ఫిటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి రోగనిరోధక కణాలు ప్రక్రియను పెంచి ఒత్తిడి ఇతర హాని నుంచి కణాలను రక్షిస్తాయి.హెర్బల్ టీ లు జీర్ణ ప్రక్రియను ఇమ్యూనిటీని పెంచుతాయి. తక్కువ సోడియం గల సూప్ లు హెర్బల్ టీలు తాజా పండ్ల రసం, గోరువెచ్చని పాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.పండ్లు కూరగాయలతో శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు సమకూరుతాయి .సీజనల్ గా దొరికే అన్ని రకాల పండ్లు కూరలు తీసుకోవచ్చు. విటమిన్-డి సమృద్ధిగా ఉండే గుడ్లు రోగనిరోధకశక్తిని క్రమబద్దీకరించి బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి.బఠానీలు, బీన్స్, మీట్ క్వినోవ్ లెంటిల్స్ ఆకుకూరలు, చేపలు,నట్స్ లో లభించే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది.
Categories