దైనందిన జీవితంలో ప్రాధాన్యత క్రమాలు తప్పనిసరిగా ఆచరించి తీరాలి లేనిపక్షంలో పని- జీవిత సమతౌల్యం గాడి తప్పి పోయి సమస్యలు ఎదురవుతాయి.ప్రతి పని అది పెద్దది కానీ చిన్నదిగా అవనీ స్పష్టమైన అవగాహనతో ఉంటే ప్రాధాన్యత క్రమంలో ఏ పని ఎప్పుడు చేయవచ్చో అర్థమవుతుంది.క్యాలిక్యులేటెడ్ మైండ్ తో యాంత్రికంగా కాకుండా ఒక పద్ధతిగా, అలవాటుగా ప్రాధాన్యాన్ని బట్టి పని చేసుకుంటూ పోతే ఎలాంటి ఒత్తిడి ఆందోళన ఉండవు.ఈ క్రమంలో అవసరమైన వాటికి ఇష్టం లేని వాటికి నో అని చెప్పే గుణాన్ని అలవర్చుకోవాలి.ఎటువంటి అపాలజీ లు న్యాయ న్యాయ వివరణ లేకుండా నో అన్నమాటను మృదువుగా మన్నన గానే అయినా ఖచ్చితంగా చెప్పగలగాలి.ఏ పని ఎప్పటికీ పూర్తి చేయగలము ఒక అవగాహన ఉంటే ఎలాంటి హడావుడి టెన్షన్ లేకుండా ఉంటుంది.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment