Categories
నైట్ షిప్ట్ జాబ్స్ తో మానసిక కుంగుబాటు కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు . 29 వేలమంది ఉద్యోగుల పనివేళ లు వారు ఎదుర్కునే మానసిక సమస్యల పైన చేసిన ఈ అధ్యయనంలో పగటి ఉద్యోగుల్లో కంటే రాత్రి ఉద్యోగాలు చేసేవారిలో కుంగుబాటును గుర్తించారు . ఒంటరిగా అయిపోతున్నామనే ఆత్మన్యూనతకు గురవుతారనీ చిన్నిచిన్ని విషయాలకు కోపం తెచ్చుకొంటూ ,చిరాకు పడుతూ అరుస్తూ ఉంటారని ,అంతులేని వత్తిడి వల్లనే ఈ చిరాకు వస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు . రాత్రి ఉద్యోగాలు తప్పనిసరి అయినవాళ్ళు పగలు తప్పని సరిగా వ్యాయామం చేయటం కుటుంబంతో ఎక్కువసేపు గడపటం వారాంతాల్లో బంధువులను కలుసుకోవటం వంటివి చేస్తే అవంటరితనం ఉండదంటున్నారు .