Categories
లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రొమ్ హోమ్ లో ఇంట్లో గంటల కొద్ది పని చేసేప్పుడు కూర్చునే పొజిషన్ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఇంట్లో కనుక ఏ మంచం పైనో,సోఫా పైనో వాలిపోయి పనిచేయకండి అంటున్నారు. ఒక చోట గంటల తరబడి కూర్చుంటే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరి తిత్తులోకి శ్వాస ఆడదు ఎక్కువ సేపు ముందుకు వాలిపోయి కూర్చుంటే కడుపులో అవయవాలు కుదించుకు పోయి జీర్ణ కోశం లో సమస్యలు వస్తాయి. ఆఫీస్ లగే అరచేతులకు సపోర్ట్ ఉండేలాగా,మోచేతులు 90 డిగ్రీలు వంచి హాండ్ రెస్ట్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. రక్త ప్రసరణ మెరుగుపరుచు కొనేందుకు 20 నిముషాల కొకసారి లేచి కాసేపు నిలబడాలి. తల పక్కలకు తిప్పి చేతులకు విశ్రాంతి ఇవ్వాలి.