సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు ఎక్కువగా వుండే మాంసాహారం తింటే గుండెపోటు వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందంటున్నారు. ఆహారంలో కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం ఎక్కువైతే ప్రమాదం డైయిరీ ఉత్పత్తులు మాంసం ఫీల్ట్రీ సీ ఫుడ్ బీన్స్ గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో జంతు సంబంధమైన ఉత్పత్తుల నుంచే వచ్చే ప్రోటీన్లు ఎక్కువ హాని చేస్తాయని చెపుతున్నారు. తక్కువ ప్రోటీన్లున్న ఆహారం మాత్రం ఆడవాళ్లకు ఆరోగ్యాన్నిస్తుందని 45 సంవత్సరాల తర్వాత వచ్చే హార్మోన్ల ఇన్ బాలన్స్ తో ఈ సమస్య నుంచి పెరుగుతాయంటున్నారు. ఈ రిపోర్ట్ చూసాక స్త్రీలకు తప్పనిసరిగా వాళ్ళ వయసు బరువు ఎత్తుకు సంబంధించి డైట్ చార్ట్ ఉంటేనే బావుండనిపిస్తుంది.
Categories