హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల లేపనాలు మూలికలు వాడేవారు. ఆ రోజుల్లో లిప్ స్టిక్ లేదు కనుక తాంబూలమే పెదవులకు అలంకారం నూర్జహాన్ తమల పాకులు రకరకాల సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల  దాన్ని తింటే పెదవులు ఎర్రగా సహజసిద్ధంగా అందంగా ఉంటాయని గ్రహించింది పాత రోజుల్లో భోజనం అయ్యాక తాంబూలం వేసుకోవటం అలవాటుగా ఉండేది కానీ పళ్ళు పాడైపోతాయని మానేశారు. కానీ తాంబూలం లేదా తమలపాకు కిళ్ళీలో  వేసే సుగంధ ద్రవ్యాలతో నూరు కడుపు బాగుపడతాయి . భారత దేశంలో కొన్ని లక్షల మంది కిళ్ళీల తయారీలో పొట్ట పోసుకునే వాళ్ళున్నారు. మిఠాయి కిళ్ళీల  కొబ్బరి తురుము చక్కర ఖర్జురం  ముక్కలు గుల్ కంద్ చెర్రీ ముక్కలు సోంపు వక్క పలుకులు ఉంటాయి. కాకపోతే అతి ఎప్పటికీ అనర్ధ దాయకమే కనుక ఈ పండగ పూటో తాంబూలం రుచి చుస్తే చాలు.

Leave a comment