Categories
పియోనీ మొక్క ఇంట్లో ఉంటే సంతోషం ప్రశాంతత ఉంటుందని నమ్ముతారు జపనీయులు.చైనా చక్రవర్తులు ఈ పియోనీ పూలను శుభ సూచకంగా భావించేవారు. క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ గా పిలిచే ఈ పియోనీ పూలు గుబురుగా పురి విప్పుకొన్నట్లు వికసిస్తాయి. ఈ పియోనీ లో 40 రకాల జాతులున్నాయి కానీ గులాబీ రంగు పూలు పూసే మొక్క మటుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇంట్లో పెంచుకునే మొక్క.ఈ ముళ్ళ మొక్కను డ్రాయింగ్ రూమ్ డెకరేషన్ గా వాడతారు.