ఈ మధ్య పేపర్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ 10 లక్షల విలువైన బ్యాగ్ తో కనిపించింది.  అది బర్కిన్ బ్యాగ్ . ఈ బ్యాగ్ ల ధర ఎనిమిదిన్నర లక్షల నుంచి రెండుకోట్ల వరకూ ఉంటుందట.  లెదర్ రకం , వాడిన లోహాం బట్టి ధరలు మారుతుంటాయి. మొసలి చర్మంతో తయారైన ఒక గులాబీ రంగు హాండ్ బ్యాగ్ మూడేళ్ళ క్రితం 1.64 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచ వ్యాప్తంగా వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన బ్యాగ్ హెర్శెస్ కంపెనీదే. ఆ బ్యాగ్ హాండిల్ భాగాలను బంగారంతో చేసి 240వజ్రాలు పొదిగాయట. ఈ బ్యాగ్ కొనాలంటే ఫ్యారిస్ తో పాటు మరికొన్ని దేశాల్లోని దుకాణాలకు వెళ్ళి కొనుక్కొవాలి. స్టాక్ ఉండదు.ఆర్డరిస్తే ఆరేళ్ళలోపు ఎప్పుడో మెసెజ్ చేస్తారట బ్యాగ్ రెడీగా ఉందని .ఈ బ్యాగ్ అమ్మాలని అనుకొంటే ,అప్పుటి మార్కెట్ ప్రకారం ఆరుజు ఎంత ధర ఉంటే అంత ధర పలుకుతోందట.

Leave a comment