చిన్న పిల్లలు తప్పు చేస్తే వెంటనే శిక్ష తల్లిదండ్రులకే అంటుంది చైనా గవర్నమెంట్. పిల్లల చెత్త ప్రవర్తనకు మూలం కుటుంబమే అంటుంది. ఇంటిదగ్గర పిల్లలను సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ ఆహారం ఆట పాటల విషయంలో శ్రద్ధ పెట్టకుండా ఇతర పనుల్లో మునిగి తేలే తల్లిదండ్రుల వల్లే పిల్లలు టీవీలు చూస్తూ ఆన్ లైన్ ఆటలు ఆడుతూ చెడిపోతున్నారు అంటుంది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం .అందువల్ల పిల్లలను చక్క దిద్దని తల్లిదండ్రులు శిక్షార్హులే అన్న చట్టం తెస్తోంది. పిల్లల హోమ్ వర్క్, ఆటల సమయం ఎంతెంత  ఉండాలో ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. దాని ప్రకారం తల్లిదండ్రులు తమ పద్ధతులు మార్చుకుని మంచి పిల్లలను తయారు చేయాలి అంటోంది ప్రభుత్వం.

Leave a comment