Categories
ఇండోనేషియా లో ఉండే బాలి ద్వీపాన్ని దేవతల దివీ అంటారు ఇక్కడి జనాభాలో హిందువులే అధికం ఇక్కడ జరిగే పండుగల్లో హరి రాయి సరస్వతి ముఖ్యమైంది. చేతిలో జపమాల మరో చేతిలో వేదాలు ఇంకో చేతిలో వీణ మరో చేతిలో తామరపువ్వులు హంస వాహనం పైన కొలువైన సరస్వతీదేవిని బాలి వాసులు జ్ఞాన స్వరూపం గా ఆరాధిస్తారు. 1951లో ఉబుద్ రాజు ఆ దేశంలో బాలి వాస్తుశిల్పి గాస్ట్ న్యోమన్ లెంపాడ్ ఈ ఆలయం నిర్మించారు. నీటి కోలను మధ్యలో ఎంతో అందంగా ఉండే ఈ ఆలయం చుట్టూ అనేక హిందూ దేవతల శిల్పాలు చెక్కారు నిలువెత్తు సరస్వతి సందర్శకులను ఆకట్టుకుంటుంది బాలి కాలెండర్ ప్రకారం ప్రతి 210 రోజులకు సరస్వతి దినోత్సవం జరుపుకుంటారు.