Categories
నువ్వు ఆనందంగా ఉన్నావా ? లేదా అని తీరుబడిగా ఆలోచించేందుకు కూడా తగినంత విశ్రాంతి లేకపోవడం నీ దుఃఖానికి కారణం అవుతోంది అన్నాడో రచయిత.నిలబడి నీళ్ళు తాగమని చెబుతోంది క్వాలిటీ ఆఫ్ లైఫ్, కానీ ఇవ్వాల్టి యువత దృష్టిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఉద్యోగం అంటేనే సాఫ్ట్ వేర్, లక్షల్లో సంపాదన, ఎదైనా వేగంగా ఉచితంగా వచ్చేయాలి.నచ్చితే పెళ్లి వికటిస్తే విడాకులు సంపాదన కోసం విపరీతమైన వేగంతో పరుగులు తీయటం అసలైన జీవితం అనుకుంటున్నారు.చేసే పని కో ప్రయోజనం ఉండాలని శాంతిగా జీవించాలని కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉండాలని ఉన్నతమైన విలువలతో పిల్లలను తీర్చిదిద్దాలని కోరుకోని ఆ దిశగా జీవిత లక్ష్యాన్ని నిర్మించుకోవటం క్వాలిటీ ఆఫ్ లైఫ్. నిన్నటి కంటే ఈ రోజు నీలో వివేకం పెరగకపోతే మరోరోజు వ్యర్థం అయిందని గుర్తుంచమన్నాడో మేధావి ప్రతి రోజు నేను అదనంగా ఉన్నాను. నా పనిలో నాకు సంతోషం ఉంది అని అడిగితే జీవితం సరైన దారిలో సాగుతున్నట్లే.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134