Categories
రాచరిక కుటుంబంలో పుట్టి సింహాసనం వద్దనుకొంటోంది నెదర్లాండ్స్ రాకుమారి ప్రస్తుత రాజు విల్లెమ్ అలగ్జాండర్ పెద్ద కూతురు అమాలియా ఈమె యుక్త వయసు రాగానే ప్రిన్సెస్ ఆఫ్ ఆరెంజ్ బిరుదు పొందింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో సభ్యురాలు అయింది. తనకు 18వ ఏట సంక్రమించిన సుమారు రెండు మిలియన్ డాలర్ల అలవెన్స్ ను వద్దు అనేసింది. నా వయసు లో ఉన్న విద్యార్థులు కోవిడ్- 19 వల్ల అష్ట కష్టాలు పడుతున్నారు. వారికి నేను ఎలాంటి సాయం చేయలేకపోతున్నా అందుకే ఈ డబ్బులు కూడా నాకు వద్దు అని దేశ ప్రధాని కి ఉత్తరం రాసింది నాకీ సింహాసనం పైన ప్రేమ లేదు నాకు ఎన్నో కలలు ఉన్నాయి ప్రపంచం గురించి తెలుసుకోవాలి ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నా అంటుంది రాజకుమారి అమాలియా.