Categories
చిరు ధాన్యాల్లో రాగులను పోషక ధాన్యాలు అంటారు. కాల్షియం ,ఐరన్ ఇతర ఖనిజాలు విటమిన్ బి1,బి2 మొదలైనవి ఉంటాయి కనుక బలవర్ధకం. ప్రోటీన్లు ,ఎమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వేసవి ఎండతాపాన్ని తట్టుకోనేందుకు రాగి జావా అంబలి తాగుతారు. ఫైబర్ చాలా ఎక్కువ.రాగులు ఏ రూపంలో తీసుకొన్న ఆరోగ్యమే. రాగి జావా చేయటం చాలా ఈజీ కూడా.70 గ్రాముల రాగి పిండిని తీసుకొని ముందుగా గిన్నెలో నీళ్ళు వేడిచేసుకొని మరిగే నీళ్ళతో కలుపుతూ ఉండలుకట్టకుండా పోసి ,ఐదారు నిమిషాలు ఉడికిస్తే చాలు దీన్ని మజ్జిగ ,ఉప్పు కలిపి తీసుకోవచ్చు. పాలు ,బెల్లంతో అయినా పర్లేదు.