Categories
మార్కెట్ లో దొరికే రసాయనాలు ఉన్న టోనర్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని దానిమ్మ టోనర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఆ డికాషన్ చల్లారనివ్వాలి. ఆ నీళ్లలో అర కప్పు దానిమ్మ రసం ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి కలిపితే టోనర్ తయారైనట్లే. దాన్ని పొడి సీసాలో ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ టోనర్ తో మొహం మెడ మర్దన చేసి ఉదయం కడిగేస్తే చాలు, ఈ టోనర్ లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మానికి పోషణ ఇస్తాయి.