జుట్టు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటేవారానికి రెండుసార్లు తలస్నానం చేయవచ్చు. కానీ ఆయిల్‌ హెయిర్ ఉన్నవాళ్ళు అలాగే వ్యయామాలు ఎక్కువ చేసేవాళ్ళు. ప్రతిరోజు హెయిర్ వాష్ చేసుకోవల్సిందే. కానీ ఎంత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసిన జుట్టుకు నష్టమే. ఎన్నో షాంపులు అవి సహజసిద్దంగా ఉంటాయని వాటిలో రసాయనాలు లేవని ప్రచారం చేసిన అసలంటూ రసాయనాలు లేకుండా మాత్రం ఉండవు. అలాంటి షాంపులో స్నానం చేసిన జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. సాధరణమైన జుట్టు ఉన్నా సరే షాంపుతో స్నానం జుట్టును పాడు చేసేదే. అందుకే రోజు మార్చి రోజు జుట్టుకు ఏదో ఒక నూనెతో మసాజ్ చేసి ఆ తర్వాత షాంపూ చేస్తే అంత ప్రభావం ఉండకుండా ఉంటుంది. కాస్త వేడి చేసిన కొబ్బరి నూనెను కుదుళ్ళ వరకు రాసి మాసాజ్ చేయాలి.

Leave a comment