Categories
ప్రపంచంలో అత్యధికంగా తినే పండు అరటి పండు అయితే ఈ పండు సరైన సమయంలో తింటేనే ప్రయోజనం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల మధ్య తింటే ఉత్తమం అంటున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా తినచ్చు అయితే సాయంత్రం వేళలో రాత్రి పూట తింటే మటుకు శ్వాసకోశ సమస్యలు తప్పవు అంటున్నారు. రాత్రివేళ తినకపోవటం బెస్ట్ అంటారు కానీ సరైన వేళల్లో తింటే ఫలితాలు అమోఘం ఇందులో విటమిన్-బి సమృద్ధిగా ఉంటుంది. ట్రిప్టోఫాన్ సమ్మేళనం కూడా ఎక్కువ పండు తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అంతర్గత ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గిస్తుంది అరటిపండు.