సముద్రం అంటే పొంగుతున్న అపారమైన జలం. ఇసుక బీచ్ గుర్తు రావాలి. అసలు ఇసుకే లేని బీచ్ వుంది. చైనా లోని పంజిన్ ప్రాంతంలో రెడ్ బీచ్ చూస్తే అక్కడ ఇసుక వుండదు ఆప్రాంతం ఎర్రని రంగు లోని నాచు వంటి చిన్న గడ్డి మొక్కల తో చూడ చక్కగా వుంటుంది. ఇలాటి ఎరుపు రంగు మొక్కలకు కారణం సుడా అనే విత్తనం కారణం. ఈ విత్తనం ఏప్రిల్ మే నెలలో పెరగటం మొక్కలు పెత్తు ముందుగా ఆకుపచ్చ రంగులో ఉండి జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఈ బీచ్ ను చైనా గవర్నమెంట్ సంరక్షణ లోకి తీసుకొంది నిర్మిత సమయంల్లో నిర్మిత ప్రదేశాలను మాత్రం పర్యాటకులను చుడనిస్తుంది. ఇంత అందమైన గడ్డి ప్రపంచంలో ఇంకెక్కడా లేదట.