Categories
మధ్య వయసు దాటిన మహిళల్లో ముఖంపైన ముక్కుకి ఇరువైపులా నోటి చుట్టూ నల్లని మచ్చలు వస్తూ ఉంటాయి. హార్మోన్ల మార్పుల వల్ల మోనోపాజ్ సమయంలో కనిపిస్తాయని చెపుతున్నారు డాక్టర్లు. వీటిని తగ్గించుకొనేందుకు నిత్యం నీళ్లు ఎక్కువ తాగటం మొదలు పెట్టారు. టమోటో,బీట్ రూట్ క్యారెట్ వంటి కూరగాయలు రసాలు తాగాలి. మసాలా కారం వంటివి తగ్గించుకోవాలి. కప్పు పాలలో స్పూన్ చొప్పున సుగంధ పాలు పటిక బెల్లం చూర్ణం నిత్యం రెండు పూటలా తీసుకోమంటున్నారు ఆయుర్వేద వైద్యులు సుగంధ పాలు చర్మం రంగును పెంచుతోంది. పుల్లటి పెరుగులో మెత్తని బార్లీ పొడి కలిపి పేస్ట్ గా తయారు చేసి ప్యాక్ వేసుకోవాలి. టమాటో రసం కలిపిన ప్యాక్ కూడా చాలా బాగా పని చేస్తుంది.