నీహారిక,

ఒక వయసులో ఉద్యోగం చేరి పెళ్ళాం, కాపురం చేస్తూ పిల్లల భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తూ తమ భవిష్యత్ మర్చి పోయే తల్లిదండ్రులు సంఖ్యా ఎంతో ఉంది. పిల్లలు పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతే మళ్ళీ కష్టాల్లో మునిగి భాద పడేది వీళ్ళే. అందుకే రిటైర్ మెంట్ గురించి ఆలోచించాలి. పిల్లలు పెద్దయ్యాకా అధిక ఇబ్బందులు వస్తే వాళ్ళ పైన ఆధారపడటం నిజంగా తప్పే. సర్వీస్ లో ఉండగానే రిటైర్ మెంట్ ప్లాన్ చేసుకోవాలి. రిటైర్ మెంట్ వయసుకు ఇంటి అద్దె ఇతర అప్పులు ఉండకూడదు. వాహనం అప్పు, పిల్లల చదువుల అప్పులు, పెళ్ళిళ్ళ బాద్యతలు ముగించుకొని ఉండాలి. తమ అధిక భరోసాలు రిటైర్ అయితేనే అదృష్టవంతులు. అందుకే మొదటి వారు చిన్నపాటి పొదుపు చేసికొని తీరాలి. మనం ఎవరిపైనా ఆధారపడ కూడదని లక్ష్యం పెట్టుకోవాలి. చివరి జీవితం ఎంత సింపుల్ గా కన్న [పర్లేదు. అది పిల్లలైన సరే వారి దయా ధర్మాలతో  సాగే జీవితం మాత్రం కోరుకోవద్దు. చివరి నిమిషం వరకు డబ్బు అవసరం ఉంటూనే ఉంటుంది. దాన్ని గుర్తుంచుకొని వయసులో ఉండగానే ప్లాన్ చేసుకోవాలి.

Leave a comment