Categories
ఏ రకంగా బరువు పెరిగిన ప్రమాదమే కాననీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం మరీ ప్రమాదం అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు సరిపడా ఉన్నప్పటికీ నడుం దగ్గర లావుగా ఉంటే అది హృద్రోగాలకు దారీ తీస్తుంది. ఊబకాయానికి గుండెజబ్బులకు సంబంధం ఉందనేది ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది అయితే ఈ కేసుల్లో పొట్ట చుట్టూ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నవాళ్ల లోనే గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక పొట్ట భాగంలో కొవ్వు పేరుకొంటె వారానికి 150 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయటం వల్ల రక్తప్రసరణ సాఫీగా ఉంటుందని తద్వారా గుండె పనితీరు మెరుగవుతుందననీ వివరిస్తున్నారు పరిశోధకులు.