Categories
రోజంతా ఎన్ని పనులు చేసినా ఇంకా ఎడతెరిపి లేకుండా ఉంటూనే ఉంటాయి. అయితే ఎన్ని గంటల పాటు పని చేసినా ఓ నలబై నిమిషాలు మైండ్ హోలీడే కావాలి. ఇవి పూర్తి సెలవు కాదు కానీ తాత్కాలికం మంచి ప్రభావం చూపెడుతుంది. ఈ 45 నిమిషాలు పూర్తి మన కోసం కేటాయించుకోవాలి. లేదా అన్ని గాడ్జట్స్ స్విచ్ అఫ్ చేసి మృదువైన సంగీతం వింటూ చల్లని జ్యూస్ ఎదో ఒక్కటి ఆస్వాదిస్తూ తినాలి. లేదా గోరువెచ్చని నీటలో ఉప్పు వేసి పాదాలను వుంచి హాయిగా మైండ్ కు విశ్రాంతి ఇస్తూ రిలాక్స్ అవ్వాలి. అలా 20 నిమిషాల పాటు విశ్రాంతే అయినప్పటికీ, మన మనస్సుకి ఇది మనకోసంగా తీసుకొంటున్న బ్రేక్ అని తెలుస్తుంది కాబట్టి నిజమైన విశ్రాంతి లభిస్తుంది.