కౌల్ ట్యూనిక్ పేరుతో కుర్తీ దుపట్టాలను కలుపుకొని కొత్త స్టయిల్ లో మార్కెట్ లో ప్రత్యేక్షం అయింది.చాలా సౌకర్యంగా అనిపిస్తున్న ఈ కుర్తీ మోకాళ్ళ  కింద భాగం అంచులు మడచినట్లు పైకి దోపినట్లు ఉంటుంది. కుర్తీ మెడ దగ్గర నుంచి దుపట్టా జతచేసి వుంటుంది. స్లీవ్స్,స్లీవ్ లెస్ లు రెండు స్టయిల్స్ లో ఈ కుర్తీలు ప్లయిన్ ,ప్రింటెడ్ కలర్స్ లోను చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.                 నెగరెట్  ప్యాంట్లు ట్రౌజర్ జతచేస్తే వేడుకల్లో ఈ డ్రెస్ చాలా బావుంటుంది. ఈ స్టయిల్ డ్రెస్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు సాదా డ్రెస్ కు గోట్ లెస్ తో దుపట్టాను జతచేస్తే ఇది పార్టీ వేర్ గా స్టయిలిష్ గా వుంది. ఈ కౌల్ స్టయిల్ కుర్తీ తో బరువైన వెండి నగలు  చక్కని మాచింగ్ .

Leave a comment