Categories
జనాభా పెరిగినంతగా భూమి పెరిగిపోదుకదా. నగరాలకు వలసలు ఎక్కువై పోయాయి. మరి వచ్చిన జనం నివశించారు ఎక్కడ? ఆలా వచ్చాయి రూఫ్ టాప్ ఇళ్ళు ఎక్కడ స్థలం లేదా ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా లో ఏకంగా షాపింగ్ మాల్ పైన గ్రేటర్ కమ్యూనిటీ నిర్మించారు. అంటే రూఫ్ టాప్ ఇళ్ళు కట్టారు. ఇదో కాలనీ తమ్రిన్ సిటీ మాల్ పై కట్టిన ఈ ఇళ్ళు సముదాయం చూసేందుకు బావుంటుంది. సైకిళ్ళు కార్లు ఈ ఇళ్ళ ముందున్న రోడ్లపై హాయిగా ప్రయాణం చేస్తాయి, ఆయ స్థలాలు,స్విమ్మింగ్ పూల్,పార్కులు అన్ని ఉన్నాయి మొత్తం 78 రెండుఅంతస్థుల ఇళ్ళు ఇవి భవిషత్ లో ఇలాటి ఇళ్ళే ఎక్కడ చుసిన కనిపిస్తాయేమో.