తల్లిదండ్రులు పిల్లలకు టోయ్ లెట్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది పిల్లల పెంపకంలో మొదటి సూత్రం చాలా ముఖ్యమైన విషయం రెండేళ్ళ వయస్సు రాగానే ఈ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాలి పిల్లలు డిపర్లు ఇష్టపడక అండర్ ఫ్యాంట్స్ వాడేందుకు మొగ్గు చూపిస్తున్నప్పుడు కూడా మొదలెట్టవచ్చు. వాళ్ళు అలవ్వాటు పడేందుకు మూడు నెలలు పట్టవచ్చు. బలవంతంగా అలవాటు చేస్తూ, పక్క తడిపారని పనిష్మెంట్ ఇస్తే మాత్రం పిల్లలకు చాలా కష్టం. దీని వల్ల వాళ్ళ భయం టెన్షన్ మొదలవ్వుతుంది. పిల్లలను క్రమబద్దమైన వేళలు అలవాటుగా చేసి రాత్రి వేళ టాయ్ లెట్ కు తీసుకుపోవాలి. వాళ్ళంతట వాళ్ళకు అలవాటు అయ్యేవరకు విసుక్కోకూడదు. అలవాటు పడేక్రమంలో తల్లిదండ్రులు ఓర్పుగా సపోర్టివ గా వుండాలి. పక్కతడిపేస్తారని వాళ్ళకు రాత్రిళ్ళు మంచినీళ్ళు తాగించకుండా వుంటారు కొందరు. అదీ సవ్యమైన పద్దతి కాదు. సహనంగా వాళ్ళకు అలవ్వాటు చేస్తే ఆ సరైన అలవాటు తో జీవిత పర్యాంతం వాళ్ళు సుఖంగా వుంటారు.
Categories