Categories
Soyagam

కనురెప్పలు రెండూ అలంకరించుకోవాలి.

అలంకరణ విషయంలో చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే మేకప్ చేసేసుకోవచ్చు. అదే పనిగా కనుబోమ్మల్ని షేప్ చేయిస్తే వయస్సు పెరిగే కొద్దీ అవి పల్చబదిపోతాయి. కానీ అలా వదిలేస్తే ముఖంలో వయస్సు కనబడుతుంది. షేప్ చేయించుకోవడం మధ్యమధ్యలో వాయిదా వేస్తూ ఐబ్రో పెన్సిల్ తో దిద్దుకుంటే బావుంటుంది. సాధారనంగా కింది కనురేప్పకు కాటుక పెట్టుకుంటారు. అప్పుడు కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి. ఏ అలంకరణ అయినా రెండు కనురెప్పలకూ చేసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల రంగుకు మ్యాచ్ అయ్యేవి రాసుకోన్నాక పెదవుల మధ్యలో లిప్ గ్లోస్ అద్దుకొంటే బావుంటుంది. మస్కరా వేసుకొనే టట్లయితే ముందుగా దీన్ని  టిష్యు పేపర్ పైన అద్దాలి. అందువల్ల అతుక్కుపోయినట్లు కనిపించదు. అలంకరణ అంతా అయ్యాక పేపర్ అద్దుకొంటేనే బావుంటుంది. ముక్కు, గడ్డం, నుదుటి పై ఉపయోగించాలి. అలాగే ఫౌండేషన్ రాసే ముందు మాయిశ్చురైజర్ అద్దాలి అప్పుడే ఫౌండేషన్ సమానంగా పరుచుకుంటుంది.

Leave a comment