సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా మంది కనిపిస్తారు. కానీ భార్యా భర్తల మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉంటె అది ఆర్ధికంగా మానసికంగా చాలా సమస్యలకు కారణం అవుతుందనుటన్నారు ఎక్సపర్ట్స్. భర్త భార్య కన్నా పేదవాడైతే త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం వుందని భార్య అభద్రతకు గురవుతుందని చెపుతున్నారు. సమ వయస్కులు కొద్దిపాటి అంతరం ఉన్నా భార్య భర్తలు ఆలోచనా విధానం ఒకే రకంగా ఉంటుందనీ పెద్దగా అభిప్రాయ బేధాలు రావనీ సఖ్యతతో పాటు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు అధ్యయనాలు. శృంగార పరమైన అసంతృప్తుల కారణంగా ఐ=ఒక్కసారి భార్యా భర్తలు విడిపోయే అవకాశాలే ఎక్కువని చెపుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం భార్యా భర్తల మధ్య ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉంటె వాళ్ళు విడిపోయేందుకు 95 శాతం పది సంవత్సరాల తేడా ఉంటే 15 శాతం మాత్రమే విడిపోయే అవకాశాలున్నాయిట. ఐదు శాతం తేడా ఉంటే 15 శాతం మాత్రమే విడిపోయే అవకాశాలున్నాయిట. సమవయస్కులైతే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందిట.
Categories