సముద్రం తో ముడిపడిన జీవితం మాది సముద్రం మా ఆకలి తీర్చే అమ్మ. ఈ  చేపల వేట సులువైనది కాదు. అయినా ఈ వేట మాకు నచ్చింది అంటున్నారు మొరాకో గ్రామ మహిళా జాలర్లు.ఫతిహా నాజీ, ఫాతిమా మెఖ్నాన్, సైరా ఫిత్నో,అమినా మెఖ్నాన్ మరో 14 మంచి మహిళా జాలర్లు ప్రతిరోజు పడవ ఎక్కి చేపలవేటకు వెళ్తారు మొరాకో మొట్టమొదటి మహిళా జాలర్లు గా గుర్తింపు సాధించిన వీరు మోసెస్ కాంద్  ప్రాంతానికి దిగువగా,మధ్యధరా సముద్ర తీరం వెంబటే ఉన్న బెలియోనెబ్  గ్రామం దగ్గరలో ఉన్న స్పెయిన్  పట్టణం సేవుటా లో ఈ గ్రామస్తులు  పనులు చేసుకునే వాళ్లు ఆ భూభాగాన్ని మూసేసింది. దీనితో వాళ్ళ ఉద్యోగాలు పోయాయి స్థానిక మహిళలకు ఉపాధి చూపే ఆలోచనలో అక్కడి సహకార సంస్థ 19 మంది మహిళ జాలర్ల బృందానికి  శిక్షణ ఇచ్చింది.ఇప్పుడు మహిళా జాలర్లు సముద్రపు  అలల పైన వెళ్తున్నారు.

Leave a comment