Categories
అంజనీ బాయ్ మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థాని గాయని ఆమె తాత వాసుదేవ్ మాల్పేకర్ కూడా సంగీతం లో నిష్ణాతుడు. అంజనీ బాయ్ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్ అనే గ్రామంలో కళాకారుల కుటుంబంలో జన్మించింది ఉస్తాద్ నజీర్ ఖాన్ దగ్గర శిష్యురాలిగా చేరింది అంజలి భాయ్. ఆమె 16వ ఏట 1899లో మొదట కచేరీ చేసింది.1909-1904 లో చిత్రకారులు రాజా రవివర్మ, ఎం.వి దురంధర తో ఆమెను మోడల్ గా చిత్రాలు గీశారు.1928 నుంచి సంగీత బోధకురాలు గా ఆమె బేగం అక్తర్, నైనా దేవి లతా మంగేష్కర్ వంటి అద్భుతమైన శిష్యులకు విద్య నేర్పించి. 1958లో సంగీతంలో ఆమె సేవలకు ప్రభుత్వ నాటక రంగ్ అకాడమీ ఫెలోషిప్ తో సత్కరించింది. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి స్త్రీ అంజనీ బాయ్.