Categories
గడచిన సంవత్సరం లో తన సేవలతో ప్రజలను ప్రభావితులను చేసినందుకు గాను భారత్ లోని అత్యంత శక్తివంతమైన ప్రభావ పూర్వకమైన 21 మంది లో ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021లో పేరుతెచ్చుకుంది మెటిల్డా కుల్లు ఒడిస్సా సుందర్ఘర్ జిల్లాలోని గార్దభహల్ గ్రామానికి చెందిన ఆశ వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి తో ప్రపంచం గడగడలాడుతున్న సమయంలో కోవిడ్ కిట్లు ఇతర సామాగ్రి తో కొండ కోనల్లో లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్ పై ఇంటింటికి తిరిగింది. మెటిల్డా కుల్లు తన చికిత్స అందించవలసిన 250 ఇళ్లలోని 964 మందిలో ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందించింది.