సంక్రాంతి ప్రకృతితో సహజీవనం చేసుకునే మనిషి ఆనందంగా జరుపుకునే ఉత్సవం ఈ పండగ. ప్రతి సంవత్సరం ఒక నిత్యనూతన సందేశం ఇస్తూనే ఉంటుంది. తోలి రోజు భోగి మలి రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ. ఈ మూడు రోజులు ప్రతి ఆచారం లోనూ పరోక్షంగా హెచ్చరికలే ఉంటాయి. సంవత్సరంలో ఎదుర్కున్న వైఫల్యాలని నిరాశనూ నిట్టూర్పును భోగిమంటల్లో వదిలేసి ఏ సంశయాల్ని కొత్త కోణం లో చూడటం నేర్చుకోమంటోంది.సంక్రాంతి అంటేనే సరైన మార్పు. ఓర్పు నేర్పులతో వాకిలి ముంగిట తీర్చి దిద్దే ముగ్గుతో గొలుసు కట్టను పక్క ముగ్గుకు కలిపే తీరులో కలిసి సాగుదాం. స్నేహంతో అన్న నినాదమే. కనుమ నాటే థాంక్స్ గివింగ్ ఫెస్టివల్. పశువుల ఋణం తీర్చుకునే కృతజ్ఞతా వ్యక్తీకరణే. కమ్మని తీపి వంటలతో ఇరుగు పొరుగులో బంధువులను ఆదరించటం కూడా ఆత్మీయ భావనే. హడావుడి పరుగులపై కాసేపు తీరుబడిగా ఆత్మీయులతో గడపటం సంక్రాంతి పండగలో అంతిర్లీనంగా దాక్కున్న జీవన వికాస పాఠమే. అందుకే అందరికీ సుఖదుఃఖాల నడుమ స్థితి ప్రజ్ఞతతో మెలగాలని భాదిస్తూ మన పెద్దలు అనుభవంతో రూపొందించిన ఒక గొప్ప వేడుక సంక్రాంతి.
Categories