Categories
బరువు పెరుగుతామనే భయం వుంటే వీటిని తింటే తగ్గిపోతారు అంటున్నారు నిపుణులు. అన్ని రకాల నట్స్ లో వెజిటబుల్ ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.గుప్పెడు తింటే సగటున 5 శాతం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పండ్లు కూరగాయల్లోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ.జీర్ణక్రియ రేటు బావుంటుంది.సోయా ఉత్పత్తులు శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువే వీటిలో ఆరు శాతం కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.ఓట్స్ బార్లీ లో అధికమోతాదులో శరీరం కరిగే పీచు ఉంటుంది. ఈ బీటా గ్లూకోన్ జెల్ లా రూపొంది కొలెస్ట్రాల్‌ను పేగులు గ్రహించకుండా కాపాడుతోంది. అదనపు కొవ్వు పేరుకునే అవకాశం తగ్గిస్తుంది. వీటిని ఆహారంలో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు.